నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఇచ్చే కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డులు పొందేందుకు గానూ చేనేత కళా కారుల నుంచి దరఖాస్తులను చేనేత, జౌళి శాఖ ఆహ్వానించింది. దరఖాస్తు లను 31.03.2026లోగా ఆయా జిల్లాల చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులకు సమర్పించాలని సూచించింది. ఈ మేరకు ఆ శాఖ సంచాలకులు శైలజా రామయ్యార్ ఒక ప్రకటన విడుదల చేశారు. చేనేత కార్మికులు 31.12.2025 నాటికి 30 ఏండ్ల వయస్సు నిండి పదేండ్ల అనుభవాన్ని, చేనేత డిజైనర్లు 31.12.25 నాటికి 25 ఏండ్ల వయస్సు నిండి ఐదేండ్ల అనుభవం ఉండాలని స్పష్టం చేశారు. అర్హులైన చేనేత కళాకారులు, డిజైనర్లు అవార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవాలనీ, మరిన్ని వివరాల కోసం https://handtex.telangana.gov.in ను సంప్రదించాలని సూచించారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ ఆవార్డుల కోసం దరఖాస్తులకు ఆహ్వానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



