కథానాయిక రాశి సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'గాసిప్. వైభవ్ సినీ స్కల్ప్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై యతి నిర్మిస్తున్నారు. నేటి తరానికి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్, అందమైన ప్రేమ కథతో మేళవిస్తూ సోషల్ సెటైర్ గా డైరెక్టర్ వైభవ్ కౌండిన్య తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 26న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో దర్శకుడు సాయి కిరణ్ అడివి ఈ సినిమా ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత యతి మాట్లాడుతూ,’ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని, మా చిత్రాన్ని ఎంకరేజ్ చేస్తున్న సాయి కిరణ్ అడివికి స్పెషల్ థాంక్స్. దర్శకుడు వైభవ్ చాలా ఫాస్ట్ గా పని చేస్తారు. ఒక మంచి కంటెంట్ ఉన్న ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నానుఅని అన్నారు. 'వైభవ్ నాకు ఎంతోకాలం నుండి పరిచయం ఉన్న వ్యక్తి, చాలా క్లారిటీ ఉన్న వ్యక్తి. ఈ చిత్ర బృందం అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని దర్శకుడు సాయి కిరణ్ అడివి చెప్పారు. దర్శకుడు వైభవ్ కౌండిన్య మాట్లాడుతూ,’మన జీవితాల్లో గాసిప్ అనేది సాధారణ విషయమే. కానీ మనం సరదాగా మాట్లాడే మాటలు కొన్నిసార్లు ఇతరుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఆ ప్రభావం ఎలా ఉంటుందో చూపించాలనే ఉద్దేశంతో ఈ సినిమాను రూపొందించాం. ఇందులో నా జీవితంలో, నా స్నేహితుల జీవితాల్లో జరిగిన కొన్ని నిజ సంఘటనలు కూడా ఉన్నాయి` అని తెలిపారు.
ఇతరుల జీవితాలపై ప్రభావం చూపే ‘గాసిప్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



