Wednesday, June 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలుయూనిక్ ఇన్నోవేటీవ్ షో

యూనిక్ ఇన్నోవేటీవ్ షో

- Advertisement -

సరికొత్త కంటెంట్ తో ఆహా ఓటీటీ ‘టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ పేరుతో మరో ఇన్నోవేటివ్ షోను మన ముందుకు తీసుకొస్తోంది. జూలై 3వ తేదీ నుంచి ఈ షో ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. మంచు లక్ష్మి, వైవా హర్ష, రష్మి ఈ కార్యక్రమానికి జ్యూరీగా వ్యవహరించనున్నారు. గ్రాండ్ పా కిచెన్ టీమ్, సింధు, దియాన వండర్ వుమెన్, అమృత ఫ్యాషనిస్టా, రవి యోలో గయ్, అనిరుధ్ అండ్ ప్రవీణ, ద దబిడి దిబిడి కపుల్, గౌతమ్ ఉత్తరాంధ్ర మెరుపు, అఖిల్ జాక్సన్ టాప్ తెలుగు ఇన్ఫుయెన్సర్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. మంగళవారం ఈ షో కర్టెన్ రైజర్ ఈవెంట్ ఘనంగా జరిగింది.ఆహా కంటెంట్ హెడ్ కవిత మాట్లాడుతూ,'ప్రస్తుతం ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రభావం సొసైటీ మీద చాలా ఉంది. ఫుడ్, ఫ్యాషన్, టూరిజం..ఇలా ప్రతి విషయంలో వాళ్లు చెప్పేది మనం అనుసరిస్తున్నాం. అంత ఇంపాక్ట్ వాళ్లు సొసైటీ మీద చూపిస్తున్నారు. అలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ తో చేస్తున్న ఒక యూనిక్ షో టాప్ ఇది. ఈ షో కు మంచు లక్ష్మి, వైవా హర్ష ఇద్దరు పర్పెక్ట్ హోస్టులు అని అన్నారు. ‘కోర్ టీమ్ అంతా మహిళలే ఉండి ఈ కార్యక్రమం చేస్తున్నందుకు గర్వంగా ఉంది. క్రియేటర్స్ కు, ఇన్ఫ్లుయెన్సర్స్ కు మధ్య తేడా ఉంది. ఆహా వాళ్లు ఈ కార్యక్రమాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో చేస్తున్నారు. ఈ షో ఔట్ పుట్ చూసి సర్ ప్రైజ్ అయ్యాను` అని జ్యూరీ మెంబర్ మంచు లక్ష్మి చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -