Wednesday, June 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅభిషేక్ పొరెల్‌పై లైంగిక దాడి కేసు..

అభిషేక్ పొరెల్‌పై లైంగిక దాడి కేసు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అభిషేక్ పోరెల్‌పై పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడి చేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. హుగ్లీ జిల్లాలోని మొగ్రా పోలీస్ స్టేషన్‌లో యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు అభిషేక్ పోరెల్‌పై ఛీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, ఈ ఆరోపణలను అభిషేక్ పోరెల్ ఖండించాడు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, కెరీర్‌లో స్థిరపడుతుండటంతో కొందరు కుట్ర చేస్తున్నారని పేర్కొన్నాడు. పోలీసులు తనను సంప్రదించలేదని, విచారణ తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తానని తెలిపాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -