- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : గినియా రాజధాని కొనక్రిలో డంపింగ్ యార్డ్ కూలడంతో 30 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి తీవ్ర గాయాలవడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. భారీ వర్షాల వల్ల ‘దార్ ఎస్ సలామ్’ ప్రాంతంలోని చెత్త డంపింగ్‌యార్డ్‌లోకి వర్షం నీరు రావడంతో కొండలా పేరుకుపోయిన చెత్త పక్కనే ఉన్న పూరి గుడిసెలపై కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలిసిన వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
- Advertisement -


