- కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పై కాంగ్రెస్ అగ్రనేత మల్లిఖార్జున్ ఖర్గే ఫైర్
నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పై కాంగ్రెస్ అగ్రనేత మల్లికార్జున ఖర్గే ఫైర్ అయ్యారు. నీట్ పేపర్ లీక్ కారణంగా వేలమంది విద్యార్థుల భవిష్యత్ అందకారమైందని, 20మందికిపైగా విద్యార్థులు ఆత్మహత్యకు చేసుకున్నారని, అయినా కానీ మంత్రిపదవికి రాజీనామా చేయకుండా నిస్సిగ్గుగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీ పాలనలో మొత్తం 90పైగా పలు పేపర్లు లీకేజ్ అయినట్లు ఆయన ఎక్స్ వేదికగా తెలియజేశారు. పేపర్ లీకేజ్ తో విద్యార్థులు భవిష్యత్ పాటు తల్లిదండ్రులు మానసికంగా కృంగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పాలనలో అవినీతిని ప్రశ్నస్తే దేశ ద్రోహులంటూ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. రైతులకు అండగా నిలిచిన వారిని స్వయంగా ప్రధాని మోదీ పార్లమెంటు సాక్షిగా ‘ఆందోళన జీవులు’ (movement-livers) మరియు ‘పరాన్నజీవులు’ (parasites) అని అవమానకరంగా సంబోధించడాన్ని దేశం మర్చిపోలేదు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఎవరినైనా దేశద్రోహిగా ముద్ర వేస్తున్నారు. ‘ఛాత్రోన్ కీ గూంజ్’ (విద్యార్థుల గళం) దేశవ్యాప్తంగా గట్టిగా వినిపిస్తుంది. మంత్రి ప్రధాన్ రాజీనామా చేయక తప్పదు,” అని ఆయన అన్నారు.
అంతకుముందు, ఒక ఇంటర్వ్యూలో ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. తన రాజీనామా కోరుతూ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనలు “విధ్వంసక శక్తుల ‘బి-టీమ్’ (B-team) చర్యలు” అని ప్రధాన్ వ్యాఖ్యానించారు. ఆ నిరసనకారుల గురించి ప్రస్తావిస్తూ, వారు విధ్వంసక శక్తుల ‘బి-టీమ్’ అని, ప్రజాస్వామ్యంలో తిరస్కరణకు గురైన వారు వేషం మార్చుకుని వచ్చి వ్యవస్థను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని, దేశాన్ని విభజించాలనుకునే వారి కోసం నినాదాలు చేస్తున్నారని ఆయన అన్నారు.



