- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : అరుణాచల్ ప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు బుధవారం నాటికి తీవ్ర రూపం దాల్చాయి. కేయీ పన్యోర్ జిల్లాలో వరద ఉధృతికి ఇళ్లు దెబ్బతినడమే కాకుండా, ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. యాజాలి పరిధిలోని పూసా సమీపంలో గల నీప్కో ప్రాజెక్ట్ కాలనీ వద్ద నిర్మాణంలో ఉన్న ఒక రిటైనింగ్ వాల్ కుప్పకూలడంతో వరద నీరు నివాస ప్రాంతాల్లోకి దూసుకెళ్లింది. కనీసం 18 ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను రంగంలోకి దింపింది.
- Advertisement -



