– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సత్తుపల్లి నియోజకవర్గ స్థాయి జర్నలిస్టులు
– జిల్లా అక్రెడిటేషన్ కార్డులు వచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వినతిపత్రం అందజేత
నవతెలంగాణ-సత్తుపల్లి : నియోజకవర్గ కేంద్రాల్లో పనిచేస్తున్న ఆర్సీ ఇన్చార్జిల హోదాను తగ్గించి, కేవలం మండల అక్రెడిటేషన్ కార్డులను కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేయడంపై సత్తుపల్లి నియోజకవర్గ జర్నలిస్టులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ బుధవారం సత్తుపల్లి వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత జారీ చేసిన ఈ కార్డుల వల్ల గతంలో రాష్ట్ర బస్సు పాసుల అర్హత ఉన్న తమకు ఇప్పుడు కేవలం జిల్లా పాసులకే పరిమితం చేసి అవమానించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచార పౌర సంబంధాల శాఖ తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయాన్ని ఎండగడుతూ, తమకు న్యాయం జరిగేలా బీఆర్ఎస్ తరపున మద్దతు ఇవ్వాలని కోరారు. గతంలో మాదిరిగానే అర్హులైన జర్నలిస్టులందరికీ తక్షణమే ‘జిల్లా అక్రెడిటేషన్’ కార్డులను పునరుద్ధరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నియోజకవర్గ స్థాయి జర్నలిస్టులు కేటీఆర్ ను కోరారు.
ఆర్సీ ఇన్చార్జిలకు మండల కార్డులిచ్చి ప్రభుత్వం అవమానించింది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



