Thursday, June 25, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంజపాన్‌, వెనెజులాల్లో భారీ భూకంపాలు..

జపాన్‌, వెనెజులాల్లో భారీ భూకంపాలు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : వెనెజువెలాలో రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. మోంటాల్బాన్ ప్రాంతానికి సమీపంలో 13.2 కిలోమీటర్ల లోతులో నమోదైన ఈ భూకంపం ప్రభావం కొలంబియాలో కూడా కనిపించింది. భూకంపం అనంతరం ప్రజలు భయంతో భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని అపార్ట్‌మెంట్లలో పగుళ్లు, అద్దాలు ధ్వంసం కాగా, చాలా చోట్ల భవనాలు నేలకూలాయి. ఈ నేపథ్యంలో ప్యూర్టో రికో, అమెరికా వర్జిన్ దీవులకు సునామీ ముప్పు ఉందని అమెరికా సునామీ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది. మరోవైపు జపాన్‌లో కూడా 6.9 తీవ్రతతో భూకంపం సంభవించి ప్రజల్లో ఆందోళన రేకెత్తించింది. అయితే ప్రాణ, ఆస్తి నష్టాలపై పూర్తి వివరాలు ఇంకా వెలువడలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -