- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ కూడా బ్యాటింగ్‌లో తన సత్తా చాటుతున్నాడు. తాజాగా బిహార్‌లో జరిగిన ఓ లోకల్ మ్యాచ్‌లో అతను సెంచరీ సాధించాడు. 119 బంతుల్లో 168 పరుగులు చేసి అదరగొట్టాడు. దీంతో అతడు ప్రాతినిధ్యం వహించిన ‘రిషవ్ 11’ జట్టు 40 ఓవర్లలో 311/7 పరుగులు చేసింది. అంతకు ముందు కూడా బిహార్‌లోని ఓ లోకల్ మ్యాచ్‌లో ఆశీర్వాద్ 87 బంతుల్లో 103 రన్స్ చేశాడు.
- Advertisement -



