- రాహుల్ గాంధీ
నవతెలంగాణ-హైదరాబాద్: నీట్ పేపర్ లీకేజ్ ను వ్యతిరేకిస్తు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా శ్రేణులు పలు రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనల పట్ల కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రధాన్ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెలువెత్తుతున్నాయి. తాజాగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. దేశ యువతకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ కారణంగా అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఎక్స్ వేదికగా తెలియజేశారు.
పేపర్ లీకేజీలను వ్యతిరేకిస్తు విద్యార్థులు ఆందోళనలు చేస్తుంటే అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.పదేపదే జరుగుతున్న పరీక్షా పత్రాల లీకులు, విద్యా వ్యవస్థలోని వైఫల్యాలు దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీశాయని రాహుల్ గాంధీ ఆరోపించారు.
కేవలం తమ హక్కులు, నిష్పక్షపాతమైన పరీక్షలు, సురక్షితమైన భవిష్యత్తును కోరుతున్న విద్యార్థులను విద్యాశాఖ మంత్రి ‘ఉగ్రవాదులు’ అని ముద్ర వేస్తున్నారు. కానీ ఇది కొత్తేమీ కాదు, దేశానికి అన్నం పెట్టే రైతులను ‘వృత్తిపరమైన ఆందోళనకారులు, పరాన్నజీవులు’ అని పిలిచారు. ప్రశ్నలు అడిగిన వారిపై ‘దేశద్రోహులు’ అని ముద్ర వేశారు. ఇప్పుడు యువతను ‘ఉగ్రవాదులు’ అని పిలుస్తున్నారు,” అని ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు..



