నవతెలంగాణ-హైదరాబాద్: మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా బంగ్లాదేశ్ తో కీలక మ్యాచ్ ప్రారంభమైంది. ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ నిగర్ సుల్తానా బ్యాటింగ్ తీసుకుంది. గ్రూప్ ఏ నుంచి నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన టీమిండియా ఆసియా జట్టు బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. బంగ్లాపై మెరుగైన రికార్డున్న భారత్ ఈమ్యాచ్ గెలిస్తే ఆరు పాయింట్ల సాధించనుంది. కీలక మ్యాచ్ కావడంతో తుది జట్టులోకి పేసర్ రేణుకా సింగ్, ఆల్‌రౌండర్ రాధా యాదవ్‌లకు చోటు దక్కింది.
భారత తుది జట్టు : స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యస్తికా భాటియా, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), రీచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, రాధా యాదవ్, శ్రీ చరణి, రేణుకా సింగ్, నందిని శర్మ.
బంగ్లాదేశ్ తుది జట్టు : డిలరా అక్తర్, జువారియా ఫిర్దౌస్, షర్మీన్ అక్తర్, నిగర్ సుల్తానా(కెప్టెన్, వికెట్ కీపర్), శోభా మోస్త్రే, రీతు మోని, షోర్నా అక్తర్, రబెయా ఖాన్, నహిదా అక్తర్, షంజిదా అక్తర్, మరుఫా అక్తర్



