Thursday, June 25, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసర్ ప్రక్రియతో తెలంగాణలో ఒక్క ఓటు కూడా తొలగిపోవద్దు: మంత్రి పొన్నం

సర్ ప్రక్రియతో తెలంగాణలో ఒక్క ఓటు కూడా తొలగిపోవద్దు: మంత్రి పొన్నం

- Advertisement -

నవతెలంగాణ- బంజారాహిల్స్
ఖైరతాబాద్ నియోజకవర్గంలో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 7 వెంకటేశ్వర కాలనీ డివిజన్ పరిధిలో గురువారం నుండి ప్రారంభమైన SIR (ఓటరు సవరణ ప్రక్రియ)ను స్థానిక ప్రజలకు బిఎల్ఏ, బిఎల్వోలతో కలిసి హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ లు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ఓటరు సవరణ ప్రక్రియలో అప్రమత్తంగా లేకపోతే ఓటు తొలగిపోయే అవకాశం ఉందన్నారు.

బిఎల్ఓ లు ఇచ్చే ఎన్యూమరేషన్ ఫారం నింపి ఇవ్వాలని, అప్పుడే ఓటు తొలగకుండా ఉంటుందని చెప్పారు. ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత పార్టీ నియమించిన బిఎల్ఏ, బిఎల్వోలతో పాటు ప్రతి ఒక్కరిపై ఉండదన్నారు. ఎన్నికల కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో జూన్ 25 గురువారం నుంచి జూలై 24 వరకు SIR ప్రక్రియ కొనసాగనుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 వేల పోలింగ్ స్టేషన్లలో కాంగ్రెస్ పార్టీ బి ఎల్ ఓ లను నియమించిందని గుర్తు చేస్తూ.. వీఎల్ఏ, బి ఎల్ ఓ లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఓటరు సవరణ ప్రక్రియలో అర్హత ఉన్న వారిని నమోదు చేస్తూనే ఒక్క ఓటు కూడా తొలగకుండా జాగ్రత్త పడాలని తెలిపారు.

ఇటీవల ఎన్నికలు జరిగిన బెంగాల్, తమిళనాడులో లక్షలాది ఓట్లు తొలగించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. అలాంటి పరిస్థితి తెలంగాణలో రావద్దని, ప్రతి ఒక్కరూ తమకెందుకు అని అనుకోవద్దని అన్నారు. సర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా 2002 ప్రకారం తెలంగాణలో కోటి ఓటర్లు ఉన్నరనీ, తెలంగాణలో గ్రామ స్థాయి ఉన్న కార్యకర్త నుండి పై వరకు ఒక్క ఓటు కూడా తొలగకుండా చూసుకోవాలనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ నేతలు ఓటరు సవరణ ప్రక్రియ పై ఎప్పటికప్పుడు మా కార్యకర్తలను అప్రమత్తం చేస్తున్నారని చెప్పారు. 2002 పోలింగ్ ఓటరు లిస్ట్..2025 ఓటరు లిస్ట్ పోల్చి చూడాలనీ, ఓట్లు తొలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలనీ బిఎల్ఎ బిఎల్ఓ లకు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -