Wednesday, August 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కుట్టు మిషన్ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు

కుట్టు మిషన్ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించే పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న యూనీఫాంలను ఐకేపీలో కుట్టులో శిక్షణ పొందిన మహిళ సంఘాల సభ్యులు నిర్వహిస్తున్న దుస్తుల కటింగ్, కుట్టే విధానాన్ని జుక్కల్ మండల ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంఈఓ తిరుపతయ్య, ఎపిఎం వందేమాతరం సంయుక్తంగా పరిశీలీంచారు. వారు మాట్లాడుతూ.. మండలంలోని జడ్పీహెచ్ఎస్, ఎంపియూపిఎస్, ఎంపిపిఎస్, ప్రభుత్వ పాఠశాలో సుమారుగా 1900పై చిలుకు 2026-27 అకాడమిక్ లో విద్యార్థిని, విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా ఐకేపీ జుక్కల్ శాఖ మహిళా సంఘాల సభ్యులకు ప్రతి ఏటా యూనిఫామ్స్ ను కాంట్రాక్టుకు ఇస్తున్నామని చెప్పారు. ఆగస్టు 15లోపు విద్యార్థులకు ఉచిత యూనీఫామ్ అందించాలని ఉద్దేశంతో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని పరీశీలించామని వారు స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -