Tuesday, September 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాఠశాలకు తాగునీటి సౌకర్యం కల్పించిన సర్పంచ్

పాఠశాలకు తాగునీటి సౌకర్యం కల్పించిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని దోస్తుపల్లి గ్రామ సర్పంచ్ మారుతి ప్రత్యేక చొరవ తీసుకొని ఎంపీపీ ఎస్ పాఠశాల పిల్లల కోసం త్రాగు నీటి బుధవారం వసతి కల్పించడం జరిగిందని హెచ్ఎం శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గత కొంతకాలంగా పాఠశాల పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం నిర్వహించే నిర్వాహకులకు నీటి సమస్య ఉండడం వలన బయటి నుండి నీళ్లు తెచ్చుకుంటున్నారని తెలిపారు. ఈ విషయమై పాఠశాల హెచ్ఎం సమస్యను తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. వెంటనే గ్రామ పంచయతీ ఆధ్వర్యంలో సమస్యను పరిష్కారానికై పాఠశాలకు పైప్ లైన్ వేశామని పేర్కొన్నారు. దీంతో నీటి సమస్య తీరిందని వెల్లడించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు సర్పంచ్ పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -