Thursday, June 25, 2026
E-PAPER
Homeజిల్లాలుఅంబేద్కర్ వర్శిటీ ఎం.బి.ఏ & ఎం.బి.ఏ (హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్) ఎంట్రన్స్ టెస్ట్...

అంబేద్కర్ వర్శిటీ ఎం.బి.ఏ & ఎం.బి.ఏ (హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్) ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల

- Advertisement -


దరఖాస్తుకు చివరి తేది ఆగష్టు 5, 2026

నవతెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ: డా. బి. ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎం.బి.ఏ & ఎం.బి.ఏ (హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్ ఎంట్రన్స్ టెస్ట్ కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది ఆగష్టు 5 వరకు అని విశ్వవిద్యాలయ అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అపోలో ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్ (AIHCM), కృష్ణ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (KIMS), దారూ సలాం ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (DET) , రెనోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్ (RIHCM) మరియు ఆర్.వి.ఎమ్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ (RVM) ఎం.బి.ఏ (హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్) లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవడానికి నోటిఫికేషన్ విడుదల అయింది.
ఆగష్టు 23 న ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు అర్హత పరీక్షను నిర్వహిస్తారని వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం విశ్వవిద్యాలయ వెబ్ పోర్టల్‌ను www.braouonline.in లేదా వెబ్ సైట్ www.braou.ac.in లో సంప్రదించొచ్చని సూచించారు.

పూర్తి వివరాలకు
BRAOU – 040-23680333 / 555 or www.braou.ac.in
AIHCM – 040-23556850/23543269 or www.apolloihcm.ac.in
KIMS – 9949362459 or www.kimshospitals.com
DET – 040-24802632/9704009232 or www.dshm.co.in
RIHCM- 9000922145 or www.renovahospitals.com
RVM- 7989527509 or rvmims.org లలో సంప్రదించొచ్చని అధికారులు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -