- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: హార్మూజ్ జలసంధి గుండా చమురు నౌకల రాకపోకలపై ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది.హార్మూజ్ గుండా ప్రయాణించే నౌకలు ఇరాన్ నిర్దేశించిన మార్గాలనే అనుసరించాలని, తమతో సంప్రదింపులు లేకుండా ప్రకటించే కొత్త మార్గాలను అంగీకరించబోమని ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ స్పష్టం చేసింది. ఈ సందర్బంగా ఐఆర్‌జీసీ.. హార్మూజ్‌లో సురక్షిత ప్రయాణం కావాలంటే ఇరాన్ నిర్దేశించిన నావిగేషన్ మార్గాలనే అనుసరించాలి. మా సమన్వయం లేకుండా ప్రకటించిన మార్గాలు భద్రతకు ముప్పుగా మారతాయి అని హెచ్చరించింది. అంతేకాదు, ఈ నిబంధనలను పాటించని నౌకలపై చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేసింది.
- Advertisement -



