నవతెలంగాణ-హైదరాబాద్ : ట్రస్ట్-ఫస్ట్, ఏఐ -ఆధారిత క్వాలిటీ ఇంజనీరింగ్ , డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో ప్రపంచ అగ్రగామి అయిన క్వాలిజీల్, 1,000 మంది ఏఐ -నైపుణ్యం గల ఉద్యోగుల బృందం అనే మైలురాయిని చేరుకుంది. హైదరాబాద్‌లో ముగిసిన కంపెనీ ఐదవ వార్షికోత్సవ ఫ్యామిలీ డే వేడుకల సందర్భంగా ఈ విషయాన్ని చెబుతూనే, తమ వార్షిక ఆదాయం పరంగా $100 మిలియన్లను చేరుకున్న అత్యంత వేగవంతమైన భారతీయ ఐటీ సేవల కంపెనీగా అవతరించాలనే తమ విజన్ 2028 లక్ష్యం సైతం వెల్లడించింది. ఈ వేడుకలకు 1,000 మందికి పైగా ఉద్యోగులు (క్వాలిజీలాట్స్) , వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
ఐదవ వార్షికోత్సవ ఫ్యామిలీ డే వేడుకల సందర్భంగా క్వాలిజీల్ సహ-వ్యవస్థాపకుడు, ప్రెసిడెంట్ & సీఈఓ ప్రదీప్ గోవిందసామి మాట్లాడుతూ, “గత ఐదేళ్లుగా, భవిష్యత్తు కోసం క్వాలిటీ, ఏఐ ఇంజనీరింగ్‌ను నిరంతరం క్వాలిజీల్ పునరావిష్కరిస్తూ వస్తోంది. 1,000 మందికి పైగా ఏఐలో ప్రావీణ్యం ఉన్న ఉద్యోగుల బృందాన్ని కలిగి ఉండటం ఆ ప్రయాణానికి నిదర్శనం. సాఫ్ట్‌వేర్ డెలివరీని ఏఐ పునర్నిర్మిస్తున్న తరుణంలో భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే ఉద్యోగుల బృందాన్ని నిర్మించడానికి మేము ఎఫ్‌డిఇ (ఫార్వర్డ్ డిప్లాయ్‌డ్ ఇంజనీర్) మరియు ఏఐక్యూఇ (ఏఐ క్వాలిటీ ఇంజనీర్) వంటి తదుపరి తరం ఉద్యోగ విధులను ప్రవేశపెట్టడం ద్వారా సాంప్రదాయ క్వాలిటీ ఇంజనీరింగ్‌ను అధిగమించి అభివృద్ధి చెందుతున్నాము. QMentisAI™ మరియు ValidAIte™ లలో దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా ఏజెంటిక్ , మానవ-నేతృత్వంలోని క్వాలిటీ ఇంజనీరింగ్ యుగానికి సిద్ధం చేస్తున్నాము” అని అన్నారు.
క్వాలిజీల్ సహ-వ్యవస్థాపకులు, ఇండియా ఆపరేషన్స్ హెడ్ మధు మూర్తి మాట్లాడుతూ “ఐదు సంవత్సరాల క్రితం, తమ మొదటి కార్యాలయాన్ని ప్రారంభించినప్పుడు, క్వాలిజీలట్‌ల కుటుంబాలతో మనం క్వాలిటీ ఇంజనీరింగ్‌లో తదుపరి గొప్ప ఆవిష్కరణ అయిన TNBTని నిర్మిస్తున్నామని చెప్పాను. ఈ రోజు ఆ నమ్మకం మరింత బలంగా ఉంది. ఏఐ మన పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నందున, మన బాధ్యత స్పష్టంగా ఉంది: భవిష్యత్తుకు, ఏఐ కి సిద్ధంగా ఉండటం , మన క్లయింట్లు మనపై ఉంచిన నమ్మకానికి అర్హులుగా నిలవడం” అని అన్నారు.
క్వాలిజీల్ సహ-వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & సీఈఓ అయిన కళ్యాణ్ కొండా మాట్లాడుతూ “1,000 మంది క్వాలిజీలాట్‌లను చేరుకోవడం ఒక మైలురాయి, కానీ పరిశ్రమల వ్యాప్తంగా సంపాదించుకున్న నమ్మకమే తమ గొప్ప విజయం..”అని అన్నారు.



