Thursday, June 25, 2026
E-PAPER
Homeఆటలుమ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌: బంగ్లాదేశ్‌ స్వల్ప స్కోర్

మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌: బంగ్లాదేశ్‌ స్వల్ప స్కోర్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో బంగ్లాదేశ్‌ స్వల్ప స్కోర్ చేసింది. 20 ఓవర్లలకు గాను 8 వికెట్లు 136 పరుగులు చేసింది. మొదట టాస్ గెలిచిన బంగ్లా టీం బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ బౌలర్ ఆర్పీ యాదవ్ బంగ్లా బ్యాటింగ్ ను దెబ్బతీసింది. మూడు వికెట్లు తో ఆర్పీ యాదవ్ చేలరేగిపోయింది. మిగతా బౌలర్లు లైన్ అండ్ లెన్త్ బంతులతో బ్యాటర్ల పై ఒత్తిడి పెంచి పరుగులు కట్టడి చేశారు. జూరియా (33), నిగ‌ర్ సుల్తానా (32), మోస్తారీ (22) పరుగులతో రాణించారు. ఇండియా బౌలర్లు ఆర్పీ యాదవ్ 3, శ్రీ చరణి 2, రేణుక సింగ్,శర్మ , దీప్తీ శర్మ తలా ఒక వికెట్ తీశారు.

గ్రూప్ ఏ నుంచి నాలుగు పాయింట్ల‌తో రెండో స్థానంలో నిలిచిన టీమిండియా ఆసియా జ‌ట్టు బంగ్లాదేశ్‌తో త‌ల‌ప‌డుతుంది. బంగ్లాపై మెరుగైన రికార్డున్న భార‌త్ ఈమ్యాచ్ గెలిస్తే ఆరు పాయింట్ల సాధించ‌నుంది. దీంతో సెమీస్ కు లైన్ క్లియర్ కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -