Friday, June 26, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్తెలంగాణలో 24 డీఈవో పోస్టులకు నోటిఫికేషన్

తెలంగాణలో 24 డీఈవో పోస్టులకు నోటిఫికేషన్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాఠశాల విద్యాశాఖలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DEO)/ గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 24 డీఈవో పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 19 సాయంత్రం 5 గంటలలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. బీఈడీతో పాటు కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు రుసుము రూ.1000 (ఓసీ, బీసీ), రూ.500 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ)తో పాటు అదనంగా రూ.120 పరీక్ష ఫీజు చెల్లించాలి. ఎంపిక ఆబ్జెక్టివ్ రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -