Friday, June 26, 2026
E-PAPER
Homeక్రైమ్మాచర్లలో రోడ్డు ప్రమాదం..నలుగురు హైదరాబాద్‌ వాసులు మృతి

మాచర్లలో రోడ్డు ప్రమాదం..నలుగురు హైదరాబాద్‌ వాసులు మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాచర్ల నగరవనం వద్ద ఆగి ఉన్న లారీని తుఫాను వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలు వాహనంలోనే ఇరుక్కుపోవడంతో వాటిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. మృతులంతా హైదరాబాద్‌ వాసులుగా గుర్తించారు. బంధువులు మృతి చెందడంతో వాహనంలో పామూరు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఘటనపై మాచర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -