- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్రంలో నేటి నుంచి 3 రోజుల పాటు స్టాంపులు & రిజిస్ట్రేషన్ల శాఖ అన్ని సేవలను నిలిపివేసింది. సంబంధిత శాఖ వెబ్‌సైట్, అనుబంధ ఆన్‌లైన్ సేవలకు సంబంధించి సర్వర్ నిర్వహణ పనుల కారణంగా సేవలకు అంతరాయం ఏర్పడింది. ఇవాళ ఎలాగూ మొహర్రం సెలవు ఉండటం, 28న ఆదివారం ఉన్నాయి. మధ్యలో 27న ఒక్కరోజే సేవలు అందవు. ఈనెల 29 నుంచి యథావిధిగా సేవలు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.
- Advertisement -



