Wednesday, August 5, 2026
E-PAPER
Homeఆదిలాబాద్మొన్న డోడర్నాలో.. నేడు బ్రమేశ్వరలో చిరుత దాడి

మొన్న డోడర్నాలో.. నేడు బ్రమేశ్వరలో చిరుత దాడి

- Advertisement -

మూగ జీవాలకు ముంచుకొస్తున్న చిరుత ముప్పు
నవతెలంగాణ-కుభీర్
మండల పరిధిలోని డోడర్నా గ్రామంలో ఇటీవలే పశువుల మందపై చిరుత దాడి చేసి మూగజీవి మృత్యువాత చెందిన ఘటన మరవక ముందే బ్రమేశ్వర్ లో మరో ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం బ్రమేశ్వర్ అటవీ ప్రాంతంలో మేక అనుమానస్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకాలం రేపింది. ఇది ముమ్మాటికీ చిరుత దాడి వల్లే మేక మృతి చెంది ఉంటుందని గ్రామస్తులు నమ్మకంగా చెబుతున్నారు. వెంటనే అటవీ శాఖ అధికారి రాజేష్, పశు వైద్యశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించిన అనంతరం వారు మాట్లాడుతూ.. మృతి చెందిన మేక శరీర భాగాలపై గాయాలను బట్టి చిరుత దాడిచేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. చిరుత సంచరిస్తున్న గ్రామాల చుట్టు ప్రక్కల ప్రజలు, రైతులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. కొద్ది రోజుల వ్యవధిలోనే ఇలాంటి ఘటనలు పునరావృత్తం కావడం బాధాకరమన్నారు. అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల సంచారం పెరిగినందున ప్రజలు, రైతులు, పశువుల కాపర్లు పంట పొలాలకు ఒంటరిగా వెళ్ళొద్దని సూచించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ.. అత్యవసర పరిస్థితులు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -