Wednesday, August 5, 2026
E-PAPER
Homeఆదిలాబాద్సరస్వతి మండల సమాఖ్య మహాజన సభ

సరస్వతి మండల సమాఖ్య మహాజన సభ

- Advertisement -

బ్యాంకు లింకేజీ, స్ర్తీనిధి, ఆర్థిక లావాదేవీలపై సమీక్ష.. 
నవతెలంగాణ – ముధోల్ 

మండల కేంద్రంలోని సరస్వతిమండల మహిళా సమాఖ్య కార్యాలయంలో బుధవారం 20వ మహాజన సభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీపీఎం మారుతి హాజరై మాట్లాడారు. బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, ఎస్‌ఐఎఫ్‌, పుస్తక నిర్వహణ, గత ఏడాది చేపట్టిన కార్యక్రమాలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమలు చేయనున్న కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. అలాగే పదాధికారుల పనితీరు, ఆర్థిక లావాదేవీలపై సభ్యులకు వివరించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మండల సమాఖ్య కార్యదర్శి, జయాశీల కోశాధికారి లతతో పాటు అధ్యక్షురాలు, జయ శీల లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సీసీలు గంగారెడ్డి, గోదావరి, సాయినాథ్, లక్ష్మణ్, అకౌంటెంట్ సాయి, లంకేష్, సబ్ ఆర్డినేటర్ సందీప్, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -