Wednesday, August 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ మహేష్ 

సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ మహేష్ 

- Advertisement -

నవతెలంగాణ-మిడ్జిల్
రోజురోజుకూ ఆన్లైన్లో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని, సైబర్ నేరాల పైన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని జడ్చర్ల రూరల్ సీఐ మహేష్ విద్యార్థులకు సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని జిల్లా ఉన్నత పాఠశాలలో ఆన్లైన్ మోసాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లకు లింకులు పంపిస్తే ఓపెన్ చేయొద్దని, సైబర్ నేరగాళ్లకు ఓటీపీలు, ఆధార్ కార్డు నెంబర్, బ్యాంకు అకౌంట్లు, నెంబర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పొద్దన్నారు. ప్రస్తుతం డిజిటల్ యుగంలో విద్యార్థిలే లక్ష్యంగా అనేక రకాల ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయని, పాఠశాలలో, కళాశాలలో మరింత విస్తృతంగా విద్యార్థులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. విద్యార్థులు డ్రగ్స్, గంజాయి, మద్యానికి దూరంగా ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో తహసిల్దార్ రెడ్డి, ఎస్సై శ్రీనివాసులు, సర్పంచ్ ఎడ్ల శంకర్, ఉపాధ్యాయులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -