- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : వెనిజులాలో సెకన్ల వ్యవధిలో సంభవించిన రెండు భారీ భూకంపాలు పెను విషాదాన్ని మిగిల్చాయి. ఈ విలయంలో మృతులు అంతకంతకూ పెరుగుతుండగా గల్లంతైన వారి సంఖ్య వేలల్లో ఉండటం విచారకరం. ప్రకృతి ప్రకోపానికి ఇప్పటివరకు 235 మంది బలైనట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. మరో 4300 మంది గాయపడినట్లు తెలిపింది. భవన శిథిలాల కింద ఇంకా అనేక మంది చిక్కుకున్నట్లు పేర్కొంది. ఈ వరుస భూకంపాల అనంతరం దాదాపు 40వేల మంది జాడ తెలియరాలేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
- Advertisement -



