Friday, June 26, 2026
E-PAPER
HomeNews‘బాహుబలి-3’పై అధికారిక ప్రకటన

‘బాహుబలి-3’పై అధికారిక ప్రకటన

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : భారతీయ సినీ చరిత్రలో మైలురాయిగా నిలిచిన ‘బాహుబలి’ ఫ్రాంచైజీకి పదేళ్లు పూర్తైన సందర్భంగా రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీ ‘బాహుబలి: ది టార్చ్‌బేరర్’ శుక్రవారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ అవుతోంది. దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి రూపొందించిన ఈ డాక్యుమెంటరీకి ప్రేక్షకులు, అభిమానుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ‘బాహుబలి’ రూపకల్పన వెనుక జరిగిన ప్రయాణాన్ని ఎంతో హృద్యంగా ఆవిష్కరించారని సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

డాక్యుమెంటరీ ముగింపులో అభిమానులకు ప్రత్యేక సర్‌ప్రైజ్ ఇచ్చారు. ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’లోని ప్రసిద్ధ డైలాగ్‌ను ప్రస్తావించిన రాజమౌళి.. ఈ కథ ఇంకా ముగియలేదని సంకేతమిచ్చారు. అనంతరం ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి కలిసి ‘బాహుబలి 3’ అధికారికంగా తెరకెక్కనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత తెరపై ‘The Legacy Continues’ అనే సందేశం ప్రదర్శించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో #Baahubali3 హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది.

2015లో విడుదలైన ‘బాహుబలి: ది బిగినింగ్’, 2017లో వచ్చిన ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ భారతీయ సినిమా చరిత్రలో ఎన్నో రికార్డులు సృష్టించాయి. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమాకు కొత్త గుర్తింపును తీసుకొచ్చిన ఈ ఫ్రాంచైజీ, ప్రభాస్‌ను పాన్‌ ఇండియా స్టార్‌గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించింది. విజువల్ స్టోరీటెల్లింగ్‌కు కొత్త ప్రమాణాలను నెలకొల్పిన ఈ చిత్రాల ప్రయాణాన్ని ‘బాహుబలి: ది టార్చ్‌బేరర్’ మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఇప్పుడు ‘బాహుబలి 3’ అధికారిక ప్రకటనతో మహిష్మతి కథలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. ‘వారణాసి’ సినిమా పూర్తైన అనంతరం రాజమౌళి ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌పై దృష్టి సారిస్తారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -