- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పాకిస్థాన్‌లో శనివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.4గా నమోదైనట్లు యూరోపియన్-మెడిటేరియన్ సీస్మలాజికల్ సెంటర్ వెల్లడించింది. భూకంప కేంద్రం భూమికి 35 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు తెలిపింది. భూమి ఒక్కసారిగా కంపించడంతో పలుచోట్ల ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ ఘటనలో ఆస్తి, ప్రాణ నష్టంపై ఇంకా స్పష్టత రాలేదు.
- Advertisement -



