కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉమా మురళి నాయక్
నవతెలంగాణ-నెల్లికుదురు
కాంగ్రెస్ పార్టీ బి ఎల్ ఏ లకు ఏన్యూమరేషన్ ఫామ్ పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉమా మురళి నాయక్ తెలిపారు. శనివారం ఆ పార్టీ సర్పంచులకు బిఎల్ఏలకు ఫామ్ పై అవగాహన సమావేశాన్ని ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాలలో బి ఎల్ ఏ ల పాత్ర పార్టీకి గొప్పదని, మీరు గ్రామాలలో బిఎల్వోలు ఇచ్చే ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తిస్థాయిలో చదివి సక్రమంగా పూరించి ఇవ్వాలని అన్నారు. 2002 ఓటర్ లిస్టు ప్రకారం ఈ ఫామ్ ను బోధించాలనీ తెలిపారు. బీఎల్ఏ లకు రాబోయే ఎన్నికల్లో ఏ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో గుర్తించగలిగే శక్తి వస్తుందని అన్నారు.
19 సంవత్సరాల పైబడిన వారందరూ ఓటు హక్కును కలిగి ఉండాలని చెప్పారు. ఓటరు జాబితా ఫారాన్ని తప్పులు లేకుండా నింపి వారికి అందజేయాలని సూచించారు. ఫారం నింపిన తరువాత మరొక సారి వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదో సరి చూసుకోవాలని గుర్తు చేశారు. బీఎల్ఏలు పార్టీ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతారని తెలిపారు. మీకు గ్రామంలో బిఎల్ఎ గా పార్టీ నుంచి గుర్తింపు వచ్చిందని, అది గాంధీ భవానికి మీ పేరు వెళ్లిందని, రోజువారిగా ఏ గ్రామంలో ఎన్ని పూరించారనే విషయాలు అడిగితే మీరు చెప్పాల్సిన సందర్భం వస్తుందని అన్నారు. పార్టీ బి ఎల్ ఏ లకు గ్రామంలో సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పులి వెంకన్న, నాయకులు శ్రీనివాస్, ఎదల యాదవ రెడ్డి, నాయని సత్యపాల్ రెడ్డి, కాసం లక్ష్మారెడ్డి, గుగులోతు బాలాజీ నాయక్, గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, జిల్లా మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు.



