Sunday, June 28, 2026
E-PAPER
Homeఆటలుఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో మెస్సీ సరికొత్త రికార్డు

ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో మెస్సీ సరికొత్త రికార్డు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ తన అద్భుతమైన కెరీర్‌లో మరో చారిత్రక మైలురాయిని అందుకున్నాడు. ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో వరుసగా ఏడు మ్యాచ్‌లలో గోల్ చేసిన తొలి ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆదివారం డల్లాస్ స్టేడియంలో జోర్డాన్‌తో జరిగిన ఫైనల్ గ్రూప్ మ్యాచ్‌లో ఈ అరుదైన ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్‌లో మెస్సీకి మొదట తుది జట్టులో చోటు దక్కలేదు. అయితే, ఆట 60వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఆట 80వ నిమిషంలో లభించిన ఫ్రీకిక్‌ను అద్భుతంగా గోల్‌గా మలిచాడు. దీంతో అర్జెంటీనా విజయాన్ని ఖాయం చేయడమే కాకుండా తన రికార్డుల జాబితాను మరింత పెంచుకున్నాడు. ఈ గోల్‌తో ప్రపంచకప్ టోర్నమెంట్లలో మెస్సీ మొత్తం గోల్స్ సంఖ్య 19కి చేరింది. తద్వారా ఆల్-టైమ్ రికార్డును మరింత మెరుగుపరుచుకున్నాడు. అంతేగాక‌ ప్రస్తుత గోల్డెన్ బూట్ రేసులో కైలియన్ ఎంబాపే, ఉస్మాన్ డెంబెలె, వినిసియస్ జూనియర్, ఎర్లింగ్ హాలాండ్ వంటి స్టార్ ఆటగాళ్ల కంటే రెండు గోల్స్ ఆధిక్యంలో ఉన్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -