నవతెలంగాణ – హైదరాబాద్ : మోడీ ప్రభుత్వంలోని అవినీతి అక్రమాలపై సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో గతంలో ప్రధాని మోడీ ఇచ్చిన నినాదం తాను తినను, ఇతరులను కూడా తిననివ్వను అనేది ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. ‘‘ మోడీ పాలనలోనే అయోధ్య రామమందిరానికి భక్తులు సమర్పించిన కోట్లాది రూపాయల విరాళాలు దోపిడీకి గురయ్యాయి. మోడీ పాలనలోనే కేంద్రంలోని ఒక సహాయ మంత్రి రైతులకు ఉద్దేశించిన ప్రభుత్వ రాయితీ పథకంలో కోటి రూపాయలను దోచుకున్నారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు వందలాది ఎకరాల భూములను కూడబెట్టారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ గతంలో ఇచ్చిన “నేను తినను.. ఇతరులను కూడా తిననివ్వను” అనే నినాదం ఈ శతాబ్దపు అతిపెద్ద హాస్యాస్పదమైన వ్యాఖ్య” అని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. అవినీతి నిర్మూలన పేరుతో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం అడ్డగోలుగా దేశాన్ని దోచుకుంటుందని విమర్శించారు.
మోడీ నినాదం ‘నేను తినను..ఇతరులను కూడా తిననివ్వను’ అతిపెద్ద జోక్ : సీపీఐ(ఎం)
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



