హక్కుల ఉల్లంఘన ఓ చేదునిజం

హక్కుల ఉల్లంఘన ఓ చేదునిజంమానవ హక్కులు వేరు, పౌరహక్కులు వేరు. ప్రపంచంలో ఎక్కడ పుట్టినా మనిషికి సహ జంగా లభించే స్వేచ్ఛా జీవన హక్కులు మానవ హక్కులుగా పరిఢవిల్లుతాయి. రాజ్యాంగం కల్పిం చిన హక్కులు మాత్రమే పౌరహక్కులుగా విరాజిల్లు తాయి. మత చాంధస పురుషాధిక్య రాజ్యాల్లో మహి ళాహక్కులు కాలరాయబడతాయనే విష యం ఎల్లరకూ తెలిసిందే. పెట్టుబడి దారీ దోపిడీ ఆర్థిక విధానాలు అమలవు తున్న చోట శ్రామికవర్గం హక్కులు గల్లం తవుతాయి. అలాగే బాలకార్మిక వ్యవస్థ తో బాలల హక్కులు మృగ్యం అవుతా యి. పేదరికం అణచివేత ఉన్నచోట మా నవహక్కులు వర్ధిల్లుతాయని, వికసిస్తా యని భావించడంకంటే పెద్ద భ్రమ ఏదీ ఉండబోదు.
తమ రాజ్యాంగం ప్రసాదించిన పౌరహక్కులను కాపాడుకుంటూ విశ్వ మానవ హక్కులవైపునకు ప్రయాణించడమే హక్కు ల పోరాటంగా అభివర్ణిస్తారు పరిశీలకులు. కనుకనే ఐక్య రాజ్య సమితి సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన (1948 డిసెంబరు 10) మానవ జాతి చరిత్రలోనే ఓ విశిష్ట అధ్యాయంగా చెప్తారు. ఆ ప్రకటన వచ్చిన అమృతోత్సవ వేళలో (75 ఏండ్లు) మనం ఉన్నాం. ప్రపంచ ప్రజల సార్వజనీన జీవన విలువల రక్షణకు, సుస్థిర భద్రతకు, అవాంఛనీయ హింసోన్మాద ఉద్రిక్తతలు తగ్గించడానికి ఈ ప్రకటన ఎంతగానో తోడ్పడుతుందని ఐ.రా.స. ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరస్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
జాతి, వర్ణ, లింగ, కుల, మత, రాజకీయ ఇతర కారణాలతో వివక్షలేని జీవనం గడపడం, చిత్ర హింసల క్రూరత్వం నుంచి బయటపడటం, వెట్టి చాకిరి బానిసత్వం వంటి దురాచారాల నుంచి రక్షణ పొందడం, నిర్భంధం లేని జీవన విధానం సాగిం చడం, స్వేచ్ఛగా స్వదేశంలో, విదేశాలలో పర్యటించే హక్కు కలిగి ఉండటం, సురక్షిత ప్రాంతాలలో జీవించే హక్కు, బలవంతపు పనులనుండి విముక్తి, విద్యాహక్కుతో బాలలకు స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛ, స్వాతంత్య్రం, ఏ మతాన్నైనా స్వీకరించే హక్కు మొదలైనవి మానవ హక్కుల ప్రధాన లక్ష్యాలని ఆ ప్రకటన సారాంశం.
మన దేశంలో ఈ మానవ హక్కుల పరిరక్షణా చట్టాన్ని 1993లో ఆమోదించుకున్నాం. తత్సంబం దిత మానవహక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేసుకు న్నాం. ఇది చట్టబద్దమైన స్వయం ప్రతిపత్తి గల సంస్థ. తొలుత దీనికి రాజ్యాంగ బద్దత లేదు. ఆ తర్వాత కొన్ని సవరణలతో గాని (2006లో) ఇది చట్టంగా అవతరించలేదు. అంటే మానవ హక్కుల విషయంలో మనం ఎంత నెంపాదిగా ఉన్నామో అర్థమవుతుంది. పుట్టిన ప్రతి మనిషికి స్వతంత్రంగా జీవించడానికి హక్కులుంటాయని అధీకృతంగా గుర్తించడం, తెలపడం కమిషన్‌ ద్వారా సాధ్యమైం ది. మరి ఆచరణే తత్‌ విరుద్దం గా సాగుతుంటుంది. ఇదే చేదు నిజం.
అంతర్జాతీయంగా చూస్తే ప్ర స్తుతం మధ్య ఆసియాలో ఇజ్రా యిల్‌, పాలస్తీనా ప్రజలపై భయం కర యుద్ధ దాడులు సాగిస్తూనే ఉన్నది. రక్తపుటేరులు పారిస్తున్నది. దాదాపు 15 వేల మందికి పైగా ప్రా ణాలు పోగొట్టుకున్నారు. రెండ్నెల్లు గా ఈ ఘోరకలి నడుస్తున్నది. ఈ యుద్ధోన్మాద దుర్మార్గానికి జీవితాలు జీవితాలే ధ్వంసమై పోతున్నాయి. క్షణంక్షణం పరిస్థితి దిగజారుతున్నది. మధ్యలో కొన్నాళ్ళు కాల్పులు విరమణ జరిగినా పరిస్థితి శాంతించలేదు. ‘పాలస్తీనీయులు నివసించే గాజాలో ఇప్పుడు సురక్షిత ప్రాంతం ఏదీ లేకుండా పోయిం దని యునెసెఫ్‌ ప్రకటించింది కూడా. అంటే ఆ ప్రజలు తమ హక్కులే కాదు ప్రాణాలు సైతం భ యం గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నట్టు అర్థమ వుతున్నది.
అలాగే జాతీయంగా చూస్తున్నపుడు మణిపూర్‌ మంటలు చల్లారడం లేదు. మంటలను కావాలని ఎగదోస్తున్నారా? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతున్నది. తాజాగా రెండు జాతుల సాయుధ ముఠాల మధ్య కాల్పుల్లో పదమూడుమంది నేలకొరిగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. మానవ హక్కుల కమి షన్‌ ఉన్నది. మరెందుకని ఈ పరిస్థితి? ఏడు నెలల క్రితం ప్రారంభం అయిన మెయితీ-కుకీ తెగల మధ్య ఘర్షణలో ఇప్పటికీ దాదాపు 175 మంది మరణించారు. ఏభైవేల మంది ప్రజానీకం అక్కడ కొంపా గోడు వదిలి నిరాశ్రయులయ్యారు. సుప్రీం కోర్టు నియమించిన ప్రత్యేక కమిటీ తాజా పరిస్థితిని సమీక్షించింది. శాంతి భధ్రత పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పలు ఆదేశాలు ఇచ్చింది. అయినా ఈ తాజా ఉదంతం చోటు చేసుకోవడం వల్లనే ఆ ప్రశ్న. అందుకే మణిపూర్‌ బాధితులు మేం ‘భారతీయులం కాదా? మీలాంటి మనుషులమేగా? మాపై ఈ వి వక్ష ఎందుకు? అని కన్నీటితో ప్రశ్నించడం చూస్తుం టే ఎవరికైన గుండె తరుక్కుపోతుంది. మానవహ క్కుల సంస్కృతి కోణంలో చూసినపుడు మనమెంత అనాగరికంగా వ్యవహరిస్తున్నామో తెలుస్తున్నది.
కాగా, దేశంలో గంటకు మూడుపైగా హత్యలు జరుగుతున్నాయని. రోజుకు ఆ విధంగా 78 మంది నిష్కారణంగా చనిపోతున్నారని జాతీయ నేర నమో దు సంస్థ (ఎన్‌.సి.ఆర్‌.బి) వివరించింది. ఆ విధం గా దాదాపు ప్రతి ఏటా ముప్పై వేలమంది హతు లవుతున్నారు. ఈ హత్యలు ఎక్కువగా యు.పి.లో జరుగుతున్నాయి. అలాగే మహిళా నేరాలకు సంబం ధించి గతేడాది దేశవ్యాప్తంగా నాలుగున్నర లక్షల కేసులు నమోదయ్యాయి. ఒక్క రాజధాని ఢిల్లీ నగ రంలోనే బాల నేరస్తులపై 2,436 కేసులు నమో దయినట్టు తెలిపింది. ఇది కేసులుగా నమోదైన సమాచారం. నమోదు కానిదెంతో? హక్కుల ఉల్లం ఘన కిందే వస్తుంది ఇదంతా. మానవ హక్కుల సాధన విషయంలో ఎంత వెనుకబడి ఉన్నామో తెలియడానికి ఈ అంకెలు చాలు.
అయితే, కొవ్వొత్తిలా కాలుతూ మానవ హక్కుల సాధనపోరాటంలో వెలుగులు ప్రసాదించే ఎందరో వీరులు మనకు ఉన్నారు. ఆదివాసుల హక్కుల కోసం ఆదివాసుల మధ్యనే ఏళ్ళ తరబడి పని చేస్తు ఎన్నో నిర్భందాలు ఎదుర్కొని జైలు పాలయిన స్టాన్‌ స్వామి మనకు తెలుసు. చివరకు పార్కిసన్‌ వ్యాధితో బాధపడుతున్న ఆ వృద్ధునికి తాగేందుకు జైలులో సిప్పర్‌ కూడా అందించక ఈ ప్రభుత్వం అమా నుషంగా పొట్టనపెట్టుకుంది. పాలకుల క్రౌర్యం ఎలాంటిదో ఇలాంటి ఘటనలు మనకు కళ్ళకు కడతాయి.
హక్కు అనేది ఓ సామాజిక భావన. మాన వీయ దృక్పథం పునాదిగా ఒక అర్థవంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణమే మానవ హక్కుల పోరాటలక్ష్యం. మానవ హక్కుల ప్రజాస్వామ్య సంస్కృతిని పాలకులు పాలితులు విస్మరిస్తే ఏ దేశమూ ప్రశాంతంగా మనజాలదు. ఇప్పుడు జరుగుతున్నది ఇదే.
( నేడు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం)
కె.శాంతారావు
9959745723

Spread the love