నవతెలంగాణ – హైదరాబాద్ : సరూర్నగర్ పరిధిలోని బాపూనగర్ రోడ్ నెంబర్-4లో భారీ పేలుడు సంభవించింది. పేలుడు సంభవించి రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి దేవేందర్ ఇల్లు ఒక్కసారిగా ధ్వంసమైంది. పేలుడు ధాటికి ఇంటి గోడలు, తలుపులు, కిటికీల అద్దాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే, ఘటన సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నప్పటికీ అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఘటన అనంతరం ఇంట్లోని గ్యాస్ స్టవ్, 3 గ్యాస్ సిలిండర్లు, ఫ్రిడ్జ్, గీజర్తోపాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరిశీలించగా అవన్నీ సురక్షితంగా ఉండడం.. పేలుడు మిస్టరిగా మారింది. ఇంట్లో అగ్ని ప్రమాదం ఆనవాళ్లు కూడా కనిపించలేదు. భారీ శబ్దానికి, ఇంటి ధ్వంసానికి కారణమేంటనేది ప్రశ్నార్థకంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
సరూర్నగర్లో భారీ పేలుడు.. ధ్వంసమైన ఇల్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



