Tuesday, June 30, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణ సీఎస్‌గా సంజయ్ జాజు బాధ్యతలు

తెలంగాణ సీఎస్‌గా సంజయ్ జాజు బాధ్యతలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ సీఎస్‌గా సంజయ్ జాజు బాధ్యతలు స్వీకరించారు. మంచి  ముహూర్తం చూసుకొని సచివాలయంలోని ప్రధాన కార్యదర్శి సీటులో కూర్చున్నారు. మాజీ ‍ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పదవీకాలం నేటితో ముగియడంతో ఆయన స్థానంలో సంజయ్‌ జాజు బాధ్యతలు స్వీకరించారు. 2029 ఫిబ్రవరి వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.    

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు 1992 బ్యాచ్‌కు చెందిన ఈ సీనియర్ ఐఏఎస్ అధికారి,  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్, విశాఖపట్నం మున్సిపల్ కమిషనర్‌గా, ఐటీ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. అదేవిధంగా రెండు తెలుగురాష్ట్రాలలో ఎంతో ప్రాముఖ్యత చెందిన మీ సేవ రూపకర్తలలో ఆయన ఒకరు. ఈ ప్రాజెక్టు రూపకల్పన, అమలులో ఆయన కీలక పాత్ర పోషించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -