సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్. దేశ్య నాయక్
నవతెలంగాణ-అచ్చంపేట
పట్టణంలోని బాలుర జూనియర్ కళాశాలకు నూతన భవనం ఏర్పాటు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దేశ నాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ పిలుపు మంగళవారం మేరకు బాలుర జూనియర్ కళాశాలను సందర్శించారు. ఈ క్రమంలో విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దేశ నాయక్ మాట్లాడారు. కళాశాలలో ఎంతోమంది జూనియర్ కళాశాలలో చదువుకొని డాక్టర్లుగా, విద్యావేత్తలుగా, రాజకీయ నాయకులుగా, శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దిన కళాశాల నేడు శిథిలావస్థలో ఉందన్నారు.
కళాశాలలో 180 మంది విద్యార్థులు చదువుకోవడానికి వీలున్నా ప్రస్తుతం 120 మంది విద్యార్థులు చదువుతున్నారని అన్నారు. వర్షాకాలం వర్షం వస్తే పూర్తి స్థాయిలో నీరు కారుతూ పెచ్చులు ఊడి పడుతున్నాయని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థులను భయాందోళనకు గురైతున్నారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యే స్పందించి బాలుర కళాశాలకి నూతన భవనం ఏర్పాటుచేసి మౌలిక వసతులు కల్పించాలన్నారు. విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం లేక ఇబ్బంది పడుతున్నారని, విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు శివ కుమార్, శంకర్ నాయక్, వర్ధం సైదులు, రమేష్, సురేష్, రవి తదితరులు పాల్గొన్నారు.



