Tuesday, June 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఏరువులపై కేంద్రం బాధ్యత వహించాలి 

ఏరువులపై కేంద్రం బాధ్యత వహించాలి 

- Advertisement -

– రైతులకు రైతు భరోసా నిధుల విడుదల
రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ 

రాష్ట్రంలో ఎరువులకు సంబంధించి కేంద్రం బాధ్యత వహించాలని, బీజేపీ ఎంపీలు కేంద్రం పై ఒత్తిడి తేవాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  అన్నారు. మంగళవారం హుస్నాబాద్ లో విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం మంగళవారం నుండి రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు విడుదల చేస్తుందన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రూ. 73 వేల కోట్లు ఇచ్చారన్నారు. మేము 2025 లో 9 రోజుల్లో వేశామన్నారు. రైతు లకు సన్న వడ్లు బోనస్ ఇస్తున్నామని అదేవిధంగా  రైతులకు పనిముట్లు కూడా అందిస్తున్నామన్నారు.

ధాన్యం కొనుగోలు ,విత్తనాల సరఫరా ,విద్యుత్  లో ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నామని చెప్పారు. ప్రతి రైతు వేదిక దగ్గర యూరియా పై ఏఈఓ లు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. బీజేపీ వారి క్యాచర్ ఓట్లు తొలగిస్తుందని, బీహార్ బెంగాల్ లో వారి వ్యతిరేక ఓట్లు తొలగించిందని బి ఎల్ ఏ లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయనతోపాటు మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్ పర్సన్ చిత్తారి పద్మ, జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ కేడం లింగమూర్తి , మార్కెట్ వైస్ చైర్మన్ బంక చందు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -