- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: విశాఖలోని కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ ప్రథమ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హాజరయ్యారు. మొత్తం 373 మంది డిగ్రీ, పీజీ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు బంగారు పతకాలు బహూకరించారు. గిరిజన వర్సిటీ.. విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం పెంపొందించే కేంద్రంగా నిలుస్తోందని ఆమె అన్నారు. విద్యార్థులు భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు.
- Advertisement -



