- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : నేడు ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా మంత్రివర్గం, ఉన్నతాధికారులతో పలు కీలక అంశాలపై ప్రధాని మోడీ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా పరిపాలనా సంస్కరణలు, వ్యాపార సులభతర విధానాలు, భవిష్యత్తు అభివృద్ధి లక్ష్యాలపై ఈ భేటీల్లో కీలక చర్చలు జరగనున్నట్లు సమాచారం.
- Advertisement -



