- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై కొల్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్వారపుర సమీపంలో బుధవారం తెల్లవారుజామున ప్రయాణికులతో వెళ్తున్న లగ్జరీ బస్సు, వేగంగా దూసుకొచ్చిన ట్రక్కును ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో రెండు వాహనాల్లో మంటలు చెలరేగి, ఆరుగురు ప్రయాణికులు సజీవ దహనమవగా, మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బస్సు అతివేగం, డ్రైవర్ కునుకు తీయడమే ఈ ప్రమాదానికి కారణాలుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
- Advertisement -



