Saturday, February 28, 2026
E-PAPER
Homeమానవిపచ్చి మామిడితో ఆరోగ్య ప్రయోజనాలు..

పచ్చి మామిడితో ఆరోగ్య ప్రయోజనాలు..

- Advertisement -

వేసవిలోకి ఇంకా అడుగుపెట్టకముందే.. మార్కెట్‌లో మామిడికాయలు కనిపిస్తున్నాయి. సీజన్‌లో దొరికే ఈ కాయలను వివిధ రకాలుగా వాడుతుంటారు. కొందరైతే పచ్చిమామిడి ముక్కలపై ఉప్పు, కారం చల్లుకుని యమ్మీగానూ తింటారు. పచ్చి మామిడిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. మరి ఈ మామిడి వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందామా..!

పచ్చి మామిడిలో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. ఇది హిమోఫిలియా, రక్తహీనత వంటి ప్రమాదాలను తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
రక్తం గడ్డ కట్టడాన్ని నిరోధిస్తుంది.
పచ్చి మామిడిలో కెరోటినాయిడ్స్‌ అధికంగా ఉండటం వల్ల కంటిచూపు మెరుగుపడేలా సహాయపడుతుంది.
పచ్చి మామిడిని తినడం వల్ల డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటారని వైద్యులు సూచిస్తున్నారు.
పచ్చిమామిడి అజీర్తి సమస్యల్ని తగ్గిస్తుంది.
పచ్చిమామిడిలో విటమిన్‌ ఇ, విటమిన్‌ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఎంతగానో దోహదపడతాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -