Friday, April 17, 2026
E-PAPER
Homeమానవివడదెబ్బ తగిలితే..

వడదెబ్బ తగిలితే..

- Advertisement -

ఎండల్లో ఎక్కువగా తిరిగేవారికి ఒక్కోసారి వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎండలో బయటకు వెళ్ళాల్సి వస్తే గొడుగు, మంచినీళ్లు వంటివి వెంట తీసుకెళ్లాలి. సమయానికి తగిన ఆహారం తీసుకోవాలి. వడదెబ్బ తగిలినప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాము.
– ఉల్లిగడ్డను మెత్తగా నూరి వడదెబ్బ తగిలిన వ్యక్తి శరీరానికి పైపూతగా రాయాలి.
– జీలకర్ర దోరగా వేయించి పొడిచేసి అరస్పూన్‌ పొడిని ఒకగ్లాసు నిమ్మరసంలో కలిపి ఉప్పు, పంచదార వేసుకొని తాగాలి.
– ఎండలో తిరిగి రాగానే లేదా నిద్రపోవడానికి ముందు చర్మాన్ని శుభ్రపరుచుకొని పౌడర్‌ను రాసుకోవాలి.
– మజ్జిగ తాగటం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.
– కీరదోస ముక్కల్ని రెండుపూటలా తినటం వల్ల దీనిలో ఉండే పోషకాలు డీహైడ్రేషన్‌ను దరిచేరనీయవు.
– శరీరంలో నీటిశాతం తగ్గకుండా వుండేందుకు పుచ్చకాయ, కొబ్బరినీళ్లు, మంచినీళ్లు తరచూ తాగుతూ ఉండాలి.
– సలాడ్స్‌, తాజా కాయగూరలు, ప్రూట్‌ జ్యూస్‌లు తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -