Wednesday, July 1, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమూడెకరాల రైతులకు ‘రైతు భరోసా’ నిధులు విడుదల

మూడెకరాల రైతులకు ‘రైతు భరోసా’ నిధులు విడుదల

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా వానాకాలం సీజన్‌కు సంబంధించి ‘రైతుభరోసా’ పెట్టుబడి సాయం నిధుల పంపిణీ ప్రక్రియ రెండోరోజూ విజయవంతంగా కొనసాగుతోంది. ప్రభుత్వ ప్రణాళికల ప్రకారం అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ పద్ధతిలో నేరుగా నగదు జమ అవుతోంది. నిధుల పంపిణీలో భాగంగా ఇవాళ మూడెకరాల వరకు భూమి ఉన్న రైతులందరికీ పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. రెండో రోజు లబ్ధిదారుల వివరాలను పరిశీలిస్తే.. తెలంగాణలో మొత్తం 10.68 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.1,590.02 కోట్ల నిధులు బదిలీ కానున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -