Wednesday, July 1, 2026
E-PAPER
Homeతాజా వార్తలుభార్య లావుగా ఉందని గొంతునులిమి చంపిన భర్త

భార్య లావుగా ఉందని గొంతునులిమి చంపిన భర్త

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేస్తూ, లావుగా ఉన్నావని బాడీ షేమింగ్ చేస్తూ బసవరాజ్ అనే వ్యక్తి తన భార్య ప్రియాంక (29)ను గొంతు నులిమి హత్య చేశాడు. హనాసి గ్రామంలో డిసెంబర్ 2024లో వివాహం జరిగిన కొద్ది వారాల నుంచే భర్త, అత్తమామలు కట్నం కోసం వేధించినట్లు ప్రియాంక కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రియాంక రెండుసార్లు గర్భం దాల్చినప్పటికీ, భర్త దాడుల వల్ల గర్భస్రావం అయిందని తెలిపారు. సోమవారం రాత్రి జరిగిన గొడవలో బసవరాజ్ ప్రియాంకను హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -