Wednesday, July 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కోనాపూర్ పాఠశాలలో విద్యార్థులకు బహుమతుల ప్రధానం

కోనాపూర్ పాఠశాలలో విద్యార్థులకు బహుమతుల ప్రధానం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం పలువురు విద్యార్థులకు  బహుమతులను అందజేశారు. జూన్ మాసంలో పాఠశాలలోని వివిధ తరగతుల్లో అత్యధిక శాతం హాజరు, 100 శాతం హాజరు ఉన్న విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు చౌడారపు రాంప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు రావాలని ఉద్దేశంతో వారిని ప్రోత్సహించేందుకు ప్రతినెల 100 శాతం, అత్యధిక శాతం హాజరున్న విద్యార్థులకు బహుమతులను అందిస్తున్నట్లు తెలిపారు. తద్వారా పోటీతత్వం ఏర్పడి పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెరిగేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ధర్మేందర్, అరవింద్, రామకృష్ణ, శ్రీధర్, గీత, హైమావతి, రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -