నవతెలంగాణ-హైదరాబాద్: ఇటీవల వాట్సాప్ యాప్ లో యూజర్ నెమ్ పేరుతో మెటా సరికొత్త ఆప్షన్ కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈక్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆ సరికొత్త ప్యూచర్ పై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఫీచర్ వల్ల ఇతరులలాగా నటించే (impersonation) ప్రమాదం ఉందని తేలితే, దానిని నిలిపివేసేందుకు అందుబాటులో ఉన్న చట్టపరమైన మార్గాలను అధికారులు పరిశీలిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. “వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్ వల్ల నకిలీ బెడద తలెత్తే ముప్పు ఉందన్న ప్రభుత్వం దీనిని పరిశీలిస్తుంది. ఈ ఫీచర్‌ను నిలిపివేసేందుకు ఉన్న చట్టపరమైన అవకాశాలతో పాటు, ఆ ఫీచర్ యొక్క చట్టబద్ధతను కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఒకవేళ ఇది ప్రమాదకరమని తేలితే, ప్రభుత్వం ‘మెటా’ (Meta)కు చట్టపరమైన నోటీసు జారీ చేసే అవకాశం ఉంది” అని ఒక అధికారి పేర్కొన్నారు.
కాగా, యూజర్ల వ్యక్తిగత గోప్యతను మరింత కట్టుదిట్టం చేసేందుకు యూజర్‌నేమ్ ఫీచర్‌ను తెస్తున్నట్టు వాట్సాప్ మాతృసంస్థ మెటా ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. ఫోన్ నెంబర్‌ను షేర్ చేయాల్సిన అవసరం లేకుండా కేవలం యూజర్‌నేమ్‌తో ఇతరులతో చాట్ చేసే అవకాశాన్ని ఈ ఫీచర్ కల్పిస్తోంది. ఈ ఫీచర్‌ను వాట్సాప్ ఇప్పటికే కొందరికి ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చింది. త్వరలో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయనుంది.



