Wednesday, July 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ ఆస్పత్రిలో ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు

ప్రభుత్వ ఆస్పత్రిలో ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – పరకాల
సమాజానికి వైద్యులు అందించే సేవలు వెలకట్టలేనివని, అంకితభావంతో పనిచేసే వైద్యులే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి పునాది అని ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వంశీకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం జరిగిన డాక్టర్స్ డే వేడుకల్లో భాగంగా ఏరియా ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ బాలకృష్ణను సహాచర వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ, వైద్య వృత్తిలో డాక్టర్ బాలకృష్ణ చూపుతున్న నిబద్ధత, రోగుల పట్ల ఆయన చూపే ఆప్యాయత ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. చికిత్సలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, ఆసుపత్రి కీర్తిని పెంచడంలో ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ నరేష్, డాక్టర్ మహేష్, డాక్టర్ తిరుపతి, డాక్టర్ అజిత్ మహమ్మద్, నర్సింగ్ సూపరింటెండెంట్ రామదేవి, హెడ్ నర్స్ విజయ కుమారి, శారద, ప్రసన్న, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -