Tuesday, August 11, 2026
E-PAPER
Homeక్రైమ్కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ -పెద్దవంగర 
మండలంలోని రామచంద్రు తండాలో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బాదావత్ రవి (45) ఉరివేసుకుని మృతి చెందాడు. ఎస్సై చిలువేరు ప్రమోద్ కుమార్ గౌడ్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రవి, తన భార్య కవిత తో కలిసి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతురులు ఉన్నారు. ఆయన కొంతకాలంగా మద్యానికి బానిస కావడంతో భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు మొదలయ్యాయి. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి తల్లి సోన ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -