పశువైద్యాధికారి, డాక్టర్. విజయ్
నవతెలంగాణ-నసురుల్లాబాద్
వర్షాకాలంలో పశువులు వివిధ అంటువ్యాధులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని బీర్కూర్ పశువైద్యాధికారి విజయ్ తెలిపారు. బీర్కూర్ పశువైద్యాధికారి విజయ్ ఆధ్వర్యంలో బుధవారం నసురుల్లాబాద్ మండలం దుర్కి, బీర్కూర్ మండలంలోని బారంగెడ్గి గ్రామంలో పశువులకు గాలికుంటు (ఎఫ్ఎండీ) వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ నారగౌడ్ సమక్షంలో పశువులకు ఉచితంగా టీకాలు వేశారు. ఈ సందర్భంగా పశువైద్యాధికారి విజయ్ మాట్లాడుతూ, వర్షాకాలంలో గాలికుంటు, గొంతువాపు, జబ్బవాపు, నీలినాలుక వంటి అంటువ్యాధులు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అందువల్ల ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉచిత టీకాల కార్యక్రమాన్ని ప్రతి పశుపోషకుడు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అలాగే పశుపోషకులకు ఆయన పలు సూచనలు చేశారు. పశువుల కొట్టాలను పరిశుభ్రంగా ఉంచడం, వర్షపు నీరు నిల్వ కాకుండా చూడడం, శుభ్రమైన తాగునీరు, పోషకాహారం అందించడం, పాడైన దాణా ఇవ్వకపోవడం, పశువుల్లో జ్వరం, నోటి పుండ్లు, కుంటుతూ నడవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప పశువైద్యశాలను సంప్రదించాలని సూచించారు. పశువులకు నిర్ణీత కాల వ్యవధిలో టీకాలు వేయించడం ద్వారా అంటువ్యాధులను సమర్థవంతంగా నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, రైతులు, పశుపోషకులు, పశువైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ చర్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



