- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడు అన్నా డీఎంకే పార్టీకి మరో ఎమ్మెల్యే రాజీనామా చేశారు. ఆ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి వైగై సెల్వన్ శుక్రవారం పార్టీకి రాజీనామా చేశారు.ఈ మేరకు శుక్రవారం స్వైగై సెల్వన్ తన రాజీనామా లేఖను AIADMK ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామికి పంపారు. కాగా, గురువారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మరో పరిణామంలో, AIADMK మాజీ మంత్రి సి. విజయభాస్కర్, తమిళనాడు మాజీ రవాణా శాఖ మంత్రి ఎం.ఆర్. విజయభాస్కర్ అధికారికంగా ‘తమిళగ వెట్రి కజగం’ (TVK)లో చేరారు. ప్రస్తుత నాయకత్వం పార్టీ మూల సిద్ధాంతానికి ద్రోహం చేసిందని ఆరోపిస్తూ, ఈ ఇద్దరు నాయకులు తమ ఎమ్మెల్యే పదవులకు , AIADMK ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
I
- Advertisement -



