- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరోగా నటించిన, ‘జన నాయగన్’ సినిమాకు ఎట్టకేలకు సెన్సార్ కష్టాలు తొలగిపోయాయి. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ (CBFC) కొన్ని సీన్లను కట్ చేయాలన్న షరతుతో బుధవారం ‘ఎ’ (A) సర్టిఫికెట్ జారీ చేసింది. కట్ చేయాల్సిన సీన్ల లిస్టును సెన్సార్ బోర్డు త్వరలో వెబ్‌సైట్‌లో పెడుతుంది. తుది సర్టిఫికెట్ వచ్చే వారం వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాను జూలై 24 లేదా జూలై 31న థియేటర్లలో భారీగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే తుది సర్టిఫికెట్ రాగానే అధికారిక ప్రకటన రానుంది.
- Advertisement -



